: కిరణ్ కుమార్ రెడ్డి కట్టెపట్టుకుని చిమ్మచీకటైతదని చెప్పిండు: కేసీఆర్


రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కట్టెపట్టుకుని హైదరాబాదు చిమ్మచీకటైతదని చెప్పాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు హైదరాబాదులో రెప్పపాటు కాలం కూడా కరెంటు పోవడం లేదని అన్నారు. గతంలో బల్దియాలో అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ కొత్తగా మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. కొత్తగా వచ్చింది తమ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు. హైదరాబాదును భ్రష్టు పట్టించింది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలేనని ఆయన అన్నారు. హుస్సేన్ సాగర్ ను కాలుష్య కాసారంగా మార్చిందెవరని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News