: ఆంధ్రోళ్లు కూడా కేసీఆర్ కే ఓటేస్తామంటున్నారు: నాయిని


ఆంధ్ర సోదరులు కూడా కేసీఆర్ కే ఓటేస్తామంటున్నారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి అంతా ముగ్ధులవుతున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత హైదరాబాదులో సమస్యలు లేకుండా చేశారని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేతలకు ఆందోళన మొదలైందని ఆయన చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర సోదరులంతా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News