: ముఖ్యమంత్రిగానే మీరు హైదరాబాదును అభివృద్ధి చేశారు: చంద్రబాబుకు తలసాని చురక


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'హైదరాబాదును అభివృద్ధి చేశా'నని పదేపదే చెబుతున్నారని, అయితే ముఖ్యమంత్రిగా అది ఆయన బాధ్యత అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే హైదరాబాదును అభివృద్ధి చేశారని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని, ఆయన హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో కల్వకుంట్ల తారకరామారావు ప్రచారం చేస్తుంటే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు పుడుతోందని ఆయన చెప్పారు. కేటీఆర్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News