: ఐఎస్ఐఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న వ్యక్తి!


అత్యంత పాశవికంగా చంపేస్తారని పేరున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు ఓ వ్యక్తి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఉత్తరాఫ్రికాలోని లిబియాలో మహమ్మద్ గడాఫీ హతమైన తరువాత వివిధ వర్గాల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. దీంతో 2014లో లిబియాలో అడుగుపెట్టిన ఐఎస్ఐఎస్ ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. సముద్ర తీర పట్టణమైన సిర్టేని స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్ లో కీలకమైన షరియా కోర్టు న్యాయమూర్తి, ఐఎస్ఐఎస్ విభాగపు కమాండర్, మరో కీలకమైన వ్యక్తిని ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. దీంతో ఐఎస్ఐఎస్ లో వణుకు ప్రారంభమైంది. ఆ వ్యక్తి ఎవరా? అని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అంగుళం అంగుళం వదలకుండా వెతుకులాట ప్రారంభించారు. కాగా, ఆ ఆగంతుకుడిపై ఐఎస్ఐఎస్ వ్యతిరేకవర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News