: బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ టక్కర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సత్య ప్రకాశ్ టక్కర్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయం ఎల్ బ్లాక్ లో ఐవైఆర్ కృష్ణారావు నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది నెలాఖరు వరకు టక్కర్ సీఎస్ గా కొనసాగనున్నారు. మరోవైపు ఇవాళ పదవీ విరమణ చేసిన ఐవైఆర్ కు సాధారణ పరిపాలన శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.