: కామ్ దుని హత్యాచారం కేసులో ముగ్గురికి మరణశిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు


దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కామ్ దుని అత్యాచార ఘటన దోషులకు కోల్ కతా న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. 2013లో కోల్ కతాలోని కామ్ దుని ప్రాంతానికి చెందిన శిప్రాఘోష్ (20) అనే కళాశాల యువతిని తొమ్మిది మంది కామాంధులు అపహరించి, దారుణంగా హింసించి, పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి, క్రూరంగా హతమార్చారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబ సభ్యులను కలిసి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు...దీనికి బాధితురాలి కుటుంబ సభ్యులు 'డబ్బెవరికి కావాలి? న్యాయం చేయండి, నిందితులను శిక్షించి చూపించండి' అని సవాలు విసిరారు. దీంతో న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వెనువెంటనే ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు వ్యక్తులు నిర్దోషులుగా ఈ మధ్యే విడుదలయ్యారు. దీనిపై కోల్ కతాలో ఆందోళనలు పెల్లుబికాయి. పాకలపక్షంతో సంబంధాలు ఉండడం వల్లే వారిద్దరిపై ఛార్జ్ షీట్ లో నేరారోపణ సరిగ్గా చేయలేదని ఆందోళన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసు విచారణ జరిపిన కోల్ కతా న్యాయస్థానం నిందితులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని పేర్కొంటూ ముగ్గురికి మరణశిక్ష, మరో ముగ్గురికి యావజ్జీవ ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News