: ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలనం... కర్బర్ చేతిలో సెరెనా ఓటమి
ఆస్ట్రేలియా ఓపెన్ లో పెను సంచలనం చోటుచేసుకుంది. మెల్ బోర్న్ పార్కులో జరుగుతున్న మహిళల సింగిల్స్ పైనల్ మ్యాచ్ లో జర్మన్ క్రీడాకారిణి ఏంజెలికా కెర్బర్ చేతిలో సెరెనా విలియమ్స్ ఓటమి పాలైంది. ఫైనల్ ల్లో 6-4, 3-6, 6-4, తేడాతో పరాజయం చవిచూసింది. దాంతో మహిళల టెెన్నిస్ లో ప్రపంచ నంబర్ వన్ సెరెనాకు గట్టి షాక్ తగిలింది. మరోవైపు ఏంజెలికా కెరీర్ లో తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్ ఇదే కావడం గమనార్హం.