: ఆర్జిత సేవా, లడ్డూ ప్రసాదాల ధర పెంపుకు టీటీడీ పాలకమండలి తిరస్కరణ
ఆర్జిత సేవా, తిరుమల లడ్డూ ప్రసాదాల ధర పెంచాలన్న ఉపసంఘం నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తిరస్కరించింది. దాంతో భక్తులకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.2,678 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. శ్రీవారి వైభవోత్సవాలను 9 రోజుల నుంచి 5 రోజులకు కుదించారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి బంగారు తాపడం చేయించేందుకు, తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో అమావాస్య నాడు హనుమంత వాహన సేవ నిర్వహించాలని నిర్ణయించారు. రూ.3.30 కోట్లతో రెండో ఘాట్ రోడ్డు మరమ్మతులకు ఆమోదం తెలిపారు. తిరుమలలో రూ.4.5 కోట్లతో పాపవినాశనం టోల్ గేట్ వద్ద ఆక్టోపస్ భద్రతాదళానికి భవన నిర్మాణం చేపట్టేందుకు, రాష్ట్రంలో మరో 10 ప్రాంతాల్లో శ్రీవారి వైభవోత్సవాల నిర్వహణకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.