: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరం ఉంది: పీఏ సంగ్మా


లోక్ సభ మాజీ స్పీకర్, నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత పీఏ సంగ్మా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సంగ్మా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యెన్నం శ్రీనివారెడ్డి, చెరుకు సుధాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, ఈ క్రమంలో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అవసరం ఉందని స్పష్టం చేశారు. అటు రాష్ట్రంలో బీజేపీ ప్రభావం అంతగా లేదని, టీడీపీ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News