: మూడో టీట్వంటీకి ఆసీస్ కెప్టెన్ గా షేన్ వాట్సన్
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా రేపు జరగనున్న మూడో టీట్వంటీ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ మారాడు. రెండో టీట్వంటీలో ధాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయపడ్డాడు. తొడకండరాలు పట్టేయడంతో అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆసీస్ కెప్టెన్ గా షేన్ వాట్సన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతమున్న ఆసీస్ జట్టులో వాట్సన్ సీనియర్ ఆటగాడు. టీట్వంటీ స్పెషలిస్టుగా పేరున్న వాట్సన్ గత రెండు టీట్వంటీల్లో అంతగా రాణించలేదు. మూడో మ్యాచ్ లో రాణించి జట్టుకు విజయం అందించాలని వాట్సన్ భావిస్తున్నాడు. చివరి టీట్వంటీలో విజయం సాధిస్తే ప్రపంచకప్ సన్నాహాలకు ఉపయోగపడుతుందని వాట్సన్ పేర్కొన్నాడు.