: మాజీ గవర్నర్ జనరల్ కె.వి కృష్ణారావు కన్నుమూత
మాజీ గవర్నర్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కె.వి కృష్ణారావు(93) ఢిల్లీలోని ఆర్మీబేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1923 జులై 16న జన్మించిన కృష్ణారావు స్వస్థలం విజయవాడ. బ్రిటిష్ ఇండియా ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో ఆయన సేవలందించారు. ఈ సమయంలో ఆయన పరం విశిష్ట సేవా మెడల్ పొందారు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన అనంతరం జమ్ముకశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, అగర్తల రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించారు.