: ఏపీ సీఎస్ కు వీడ్కోలు పలికిన తెలంగాణ సీఎస్
ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు నేడు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ ఆయనను కలిశారు. ఈ నేపథ్యంలో జరిగిన మర్యాదపూర్వక భేటీలో ఐవైఆర్ తో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి తెలంగాణ సీఎస్ సాదరంగా వీడ్కోలు పలికారు. కాగా నేటి సాయంత్రం ఏపీ కొత్త సీఎస్ సత్య ప్రకాశ్ టక్కర్ ఐవైఆర్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.