: ఏపీ 'స్మార్ట్ గ్రామాలు, వార్డులు' పథకానికి బ్రాండ్ అంబాసిడర్లు!
స్మార్ట్ సిటీల క్రమంలో గ్రామాలు, వార్డులను తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం 'స్మార్ట్ గ్రామాలు, వార్డులు' పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామాలు, వార్డులలో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు, ఈ పథకం మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు జిల్లాల వారీగా బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలైన రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర, విప్రో ప్రేమ్ జీలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారు పలు కార్యక్రమాలు చేపడతారు. గ్రామాలను దత్తత తీసుకొన్న వారిని సమన్వయం చేసుకొంటూ అభివృద్ధి కార్యక్రమాలు సాగేలా చూస్తారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు- జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, విశాఖపట్నం-'దివి' మురళి, తూర్పుగోదావరి-ఎన్.సి.సి. రాజు, కృష్ణాజిల్లా-'నవయుగ' విశ్వేశ్వరరావు, చిత్తూరు- గల్లా రామచంద్రనాయుడు, గుంటూరు-బొమ్మిడాల శ్రీనివాస్, నెల్లూరు జిల్లా-డాక్టర్ రెడ్డీస్ ప్రసాద్ రెడ్డిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించే అవకాశం ఉందని తెలిసింది.