: విమానంలో మోడల్ చిందులు... అరెస్టు చేసిన పోలీసులు


అమెరికాకు చెందిన టీవీ స్టార్ రాబ్ కర్దాషియన్ ప్రియురాలు, మోడల్ బ్లక్ సినా విమానంలో పెద్ద గొడవ చేసింది. విమానంలోని ప్రయాణికులతో గొడవకు దిగి గందరగోళం సృష్టించింది. ఈ క్రమంలో ఆస్టిన్ విమానాశ్రయంలో ల్యాండవ్వగానే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. డెల్టా విమానంలో లాక్స్ నుంచి లండన్ వరకు కర్దాషియన్, అతని ప్రియురాలు ఆస్టిన్ మీదుగా ప్రయాణించారు. విమానం ఎక్కేముందే ఆమె ఫుల్లుగా తాగింది. ఆ మత్తులో ఆమె ప్రయాణికులతో ఘర్షణ పెట్టుకుందని, అందుకే ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు పంపామని ఆస్టిన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమెపై అభియోగం కూడా మోపామని, మరిన్ని అభియోగాలు కూడా పెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News