: రోహిత్ మృతిపై కాంగ్రెస్ ది అనవసర రాద్ధాంతం: వెంకయ్యనాయుడు


హెచ్ సీయూ విద్యార్థుల దీక్షలో కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనటంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. రోహిత్ మరణంపై ఇంకా కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇదే వర్సిటీలో 9 మంది విద్యార్థులు చనిపోతే ఆనాడు రాహుల్ ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు. యూనివర్సిటీ వాతావరణాన్ని రాహుల్ కలుషితం చేస్తున్నారని విమర్శించారు. అంతేగాక సిరిసిల్ల మాజీ ఎంపీ రాజయ్య కోడలు చనిపోయినప్పుడు కూడా రాహుల్ రాలేదన్నారు. అలాంటిది ఇప్పుడు మాత్రం రెండుసార్లు రాహుల్ హెచ్ సీయూకు రావడంలో అర్థమేంటని వెంకయ్య అడిగారు.

  • Loading...

More Telugu News