: నేను తెచ్చిన ప్రాజెక్టులనే కొనసాగిస్తున్నారు... మీరేమైనా తెచ్చారా?: టీఆర్ఎస్ కు చంద్రబాబు సూటి ప్రశ్న
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తమపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. తమ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. ఇన్ని నెలలైనా కొత్తగా మీరేమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో తనకేం పనని కొందరు అంటున్నారని, ఈ నగరం తన మానసపుత్రిక అని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన పనులన్నీ సొంతానికి చేసుకోలేదని, ప్రజలకు చేశానని, అదే తనకు సంతృప్తని తెలిపారు. అంతేగాక తమ పాలనలో మతసామరస్యాన్ని కూడా కాపాడామన్నారు. ముఖ్యంగా పాతబస్తీలో నెలలపాటు కర్ఫ్యూ ఉండేదని, తమ పాలనలో ఎప్పుడూ అలా ఉంచలేదని వివరించారు. హైదరాబాద్ లో అడుగడుగునా తన ముద్ర ఉందని, కాదనేవారెవరని ప్రశ్నించారు.