: ‘షాట్ గన్’ మరోమారు పేలింది!... రాష్ట్రపతి పాలనను నిరసిస్తూ మోదీపై సెటైర్లు


బాలీవుడ్ అలనాటి హీరో, బీజేపీ ఎంపీ శత్రుఘ్ను సిన్హా మరోమారు ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్లు సంధించారు. అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్రపతి పాలన నిర్ణయంపై ఆయన నిరసన గళం విప్పారు. అరుణాల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిన మోదీని ఆయన డ్యాషింగ్, డైనమిక్ హీరోగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా కొద్దిసేపటి క్రితం వరుస ట్వీట్లు చేసిన షాట్ గన్, కేంద్ర మంత్రులను కూడా ‘గ్రేట్ అడ్వైజర్స్’గా దునుమాడారు. అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారం కోర్టు పరిధిలో... అది కూడా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో ఉండగానే, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు హరీబరీగా నిర్ణయం తీసుకుని ‘వండర్ డెసిషన్’ తీసుకుందని ఆయన నిందించారు.

  • Loading...

More Telugu News