: ఏపీ మంత్రి కామినేనిని పరామర్శించిన చంద్రబాబు
బీజేపీ సీనియర్ నేత, ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. నిన్న రాత్రి కామినేని ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఇటీవల గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో మోకాలుకి సర్జరీ చేయించుకున్న కామినేని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి తీసుకుని హైదరాబాదులోని తన ఇంటికి వచ్చేశారు. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ సర్కారీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న కామినేనిని గతంలోనే ఫోన్ చేసి చంద్రబాబు అభినందించారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాదు వచ్చిన చంద్రబాబు కామినేనిని స్వయంగా కలిసి పరామర్శించారు.