: బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్!...బిందెలు, క్యాన్లతో పోటీ పడుతున్న జనం


ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై నేటి ఉదయం జన సందోహం నెలకొంది. చేతుల్లో ఖాళీ బిందెలు, క్యాన్లతో జాతీయ రహదారి వద్దకు పరుగులు తీస్తున్న జనం భుజాలపై నిండు బిందెలు, క్యాన్లతో ఇళ్లకు వెళుతున్నారు. నిండా పెట్రోల్ తో జాతీయ రహదారిపై వెళుతున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలే అయ్యాయి. 108కు సమాచారమిచ్చి వీరిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు ఆ తర్వాత ట్యాంకర్ నుంచి ఒలికిపోతున్న పెట్రోల్ కోసం కుస్తీలు పట్టారు. ఏ మాత్రం చిన్న నిప్పు రవ్వ పడ్డా పెను ప్రమాదం సంభవించి తీరుతుందన్న విషయాన్ని కూడా మరిచిపోయిన జనం బిందెలు, క్యాన్లలో పెట్రోల్ నింపుకుని వెళ్లడంపైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

  • Loading...

More Telugu News