: రేపటితో గ్రేటర్ ప్రచారానికి తెర... నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. గ్రేటర్ మేయర్ పదవే కేంద్రంగా టీఆర్ఎస్, మజ్లిస్, టీడీపీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు హైదరాబాదులో విస్తృతంగా ప్రచారం సాగించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. మరోవైపు కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు గ్రేటర్ పరిధిలో అంతగా పట్టు లేదు. ఈ క్రమంలో మజ్లిస్ తో ఆ పార్టీ జట్టు కట్టింది. ప్రస్తుతం ప్రచారం పరిసమాప్తి దశకు చేరుకున్న దరిమిలా నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్న ఈ సభ నుంచి ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా పాల్గొంటున్నారు. ఈ వేదికపై నుంచి కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు.

  • Loading...

More Telugu News