: ఐవైఆర్ కు డబుల్ బొనాంజా!...బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం, అర్చక ట్రస్టుకూ నేతృత్వం


ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు పదవీ విరమణ చేయకముందే బంపర్ ఆఫర్ దక్కింది. సీనియర్ ఐఏఎస్ అధికారిగానే కాక సమర్థవంతమైన అధికారిగానూ మన్ననలందుకున్న ఐవైఆర్ రేపు రిటైర్ కానున్నారు. పదవీ విరమణ చేసినప్పటికీ ఐవైఆర్ సేవలను వినియోగించుకోవాలని ఇటీవలి కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగా ఐవైఆర్ కు చంద్రబాబు సర్కారు వీడ్కోలు పలకకముందే బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రంలోని బ్రాహ్మణుల కోసం కొంతకాలం క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటులో ఐవైఆర్ దే కీలక భూమిక. తాజాగా అదే కార్పొరేషన్ కు ఐవైఆర్ ను చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాక దేవాదాయ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టుకు కూడా ఐవైఆర్ ను చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు పదవుల్లో ఐవైఆర్ మూడేళ్ల పాటు కొనసాగుతారు.

  • Loading...

More Telugu News