: అర్ధరాత్రి సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత... రాహుల్ ను అడ్దుకున్న ఏబీవీపీ, లాఠీ చార్జీ, అరెస్ట్


రీసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆరని కుంపటిగా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రోహిత్ వేముల బర్త్ డేను పురస్కరించుకుని అర్ధరాత్రి మొదలైన 18 గంటల మాస్ హంగర్ స్ట్రయిక్ లో పాలుపంచుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వర్సిటీ గేటు వద్దే నిరసనలు స్వాగతం పలికాయి. రాహుల్ ఎంట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిపై లాఠీలు ఝుళిపించారు. అంతటితో ఆగని పోలీసులు పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి వేళ పోలీసుల లాఠీ చార్జీ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

  • Loading...

More Telugu News