: లోఫర్ హీరోయిన్ బంపర్ ఆఫర్ కొట్టేసింది


'లోఫర్' సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన దిశా పటానీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ లో 'ధోనీ-ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో ధోనీ ప్రియురాలిగా నటిస్తున్న దిశా పటానీ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. జాకీచాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో జాకీ చాన్ సరసన నటించే అవకాశం లభించిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జిమ్నాస్టిక్స్ లో ప్రావీణ్యమున్న దిశా పటానీని జాకీచాన్ సరసన నటించేందుకు ఆ సినిమా వర్గాలు ఒప్పించాయని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో టాలీవుడ్ స్టార్ విలన్ సోనూ సూద్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News