: ఢిల్లీలో ఘనంగా గణతంత్రదినోత్సవ ముగింపు వేడుకలు
ఢిల్లీలో గణతంత్రదినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట రంగురంగుల విద్యుత్ దీపాలతో కనువిందు చేసింది. విజయ్ చౌక్ వద్ద సైనికులు బీటింగ్ రిట్రీట్ నిర్వహించారు. సైనికుల విన్యాసాలు తిలకించేందుకు వేలాదిగా ఢిల్లీ వాసులు విజయ్ చౌక్ కు చేరుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.