: ప్రచారానికి టీఆర్ఎస్ డబ్బులిచ్చి మనుషులను తరలిస్తోంది: వీహెచ్


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆదరణ ఉందని చెప్పుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ మనుషులను తరలిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. హైదరాబాదులో తార్నాక డివిజన్ ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హైదరాబాదు ఉన్నత నగరంగా రూపుదిద్దుకుందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూం ఇళ్లంటూ కొత్త మోసానికి తెరతీసిందని ఆయన విమర్శించారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన మెట్రో ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News