: చిక్కుల్లో విజయ్ కాంత్... జర్నలిస్టుల పట్ల దురుసు ప్రవర్తనపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశం


జర్నలిస్టులు పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టాలంటూ మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దేవరాజన్ అనే జర్నలిస్టు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుబ్బయ్య పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా? అని డిసెంబరులో ఓ విలేకరి విజయ్ కాంత్ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన, ఈ ప్రశ్నను జయను అడిగే దమ్ము మీకుందా? అని మీడియాపై మండిపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ 'మీకు భయం... మీరు జర్నలిస్టులా? థూ...' అంటూ ఉమ్మి వేశారు. ఈ ఘటనకు సంబంధించే కేసు నమోదు చేసి విచారించేలా పోలీసులను ఆదేశించాలని దేవరాజన్ కోర్టును ఆశ్రయించారు. డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, మైలాపూర్ డిప్యూటీ పోలిస్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News