: తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు భారీగా పెంపు!


తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు సబ్ కమిటీ సిఫారసు చేసింది. దీంతో పాటు తిరుపతిలో కల్యాణ మండపం నిర్మించాలని, దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణ మండపాల అద్దెను పెంచడంతో పాటు ఆధునికీకరించాలని, రూ.50 గదుల అద్దె ధరను రూ.100కు పెంచాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే, లడ్డూ ధరను కూడా పెంచాలని నిర్ణయించినప్పటికీ భక్తులు వ్యతిరేకిస్తారన్న ఉద్దేశంతో దీని ధర పెంపుపై సబ్ కమిటీ వెనక్కి తగ్గింది. శ్రీవారి సుప్రభాత సేవతో పాటు, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మ, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావై సేవా టికెట్ల ధరలను పెంచడానికి సబ్ కమిటీలోని మెజార్టీ సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News