: కేసీఆర్ తో జర్నలిస్టు సంఘాల భేటీ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జర్నలిస్టు సంఘాలు భేటీ అయ్యాయి. జర్నలిస్టులకు ఇండ్ల అంశంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు సంఘాల నేతలు కేసీఆర్ తో చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్ లో నిన్న జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో జర్నలిస్టులందరికీ డబుల్స్ బెడ్ రూమ్స్ కన్నా మరింత మెరుగైన ఇళ్లను నిర్మిస్తామని ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్, జర్నలిస్టు సంఘాల నేతలు సీఎంతో సమావేశమయ్యారు. కాగా, హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ లోని ప్రతి జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు ఈ సౌకర్యం కల్పిస్తామని దేశానికే గర్వకారణంగా ఉండేలా జర్నలిస్టు కాలనీ నిర్మిస్తామని కేసీఆర్ పేర్కొన్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News