: రాణించిన రోహిత్, కోహ్లీ...టీమిండియా 184


మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్ (42), రోహిత్ శర్మ (60) మరోసారి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడడంతో కేవలం 12 ఓవర్లలో టీమిండియా వంద పరుగుల మార్కును దాటింది. ఈ క్రమంలో మ్యాక్స్ వెల్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయి తడబడ్డ ధావన్ మిడ్ వికెట్ పై క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆసీస్ కు 11 ఒవర్ లో తొలి వికెట్ లభించింది. అనంతరం రోహిత్ కు జతకలిసిన విరాట్ కోహ్లీ (59) ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో సమన్వయలోపంతో రోహిత్ రన్ అవుట్ గా వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (14) స్కోరు బోర్డును పరుగులెత్తించే క్రమంలో నాలుగు బంతుల్లో ఇన్సింగ్స్ ముగుస్తుందనగా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన రైనాకు కోహ్లీ శ్రమ లేకుండా చివరి బంతి వరకు ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 184 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్, ఆండ్రూ టై చెరో వికెట్ తీశారు. కాసేపట్లో 185 పరుగుల విజయ లక్ష్యంతో ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News