: వాటిని దొంగిలించాలనిపిస్తుంది: బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్


'మా అమ్మ డ్రెస్సులు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఆమె ధరించిన 1960ల కాలం నాటి బెల్ బాటమ్ ప్యాంట్లు సహా ఎన్నో దుస్తులంటే నాకు ఎంతో ఇష్టం' అంటోంది అలనాటి నటి షర్మిలా ఠాగూర్ కూతురు, బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్. ఎంత ఇష్టమంటే.. ఆమె ధరించిన దుస్తులను చూస్తుంటే, వాటిని దొంగిలించాలనిపిస్తుందని నవ్వుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ముంబయిలో నిర్వహించిన క్రాఫ్ట్స్ విల్లా బిలియన్ మెహెందీ ఫెస్టివల్ లో సోహా పాల్గొంది. ఈ సందర్భంగా తన ఫ్యాషన్ అభిరుచుల గురించి మీడియాతో మాట్లాడింది. ‘మా అమ్మది, నాదీ షూ సైజ్ ఒకటే. అప్పుడప్పుడు ఆమె షూస్ ని ధరిస్తుంటాను’ అని సోహా చెప్పింది.

  • Loading...

More Telugu News