: సమన్వయలోపంతో రోహిత్ రన్ అవుట్


విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య సమన్వయలోపంతో పెను తప్పిదం చోటుచేసుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా మంచి జోరుమీద ఉండగా ఫాంలో ఉన్న రోహిత్ శర్మ అవుటయ్యాడు. గ్యాప్ లో షాట్ ఆడిన విరాట్ కోహ్లీ క్రీజులో పరుగెడుతుండగా, రెండో రన్ కు పరుగెత్తాలని సూచించాడు. దీంతో బంతి ఎక్కడుందో చూడని రోహిత్ శర్మ లేని రెండో పరుగు కోసం పరుగెత్తాడు. బంతిని చూస్తూ పరుగెడుతున్న కోహ్లీ చేతితో రోహిత్ ను ఆగమని సైగ చేశాడు. దానిని గమనించని రోహిత్ శర్మ, ఇంచుమించు కోహ్లీని చేరుకున్నాడు. దీంతో కీపర్ బాల్ తో వికెట్లను గిరాటేశాడు. రోహిత్ శర్మ (60) రన్ అవుట్ గా 16వ ఓవర్ లో వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News