: ఆ బహుమతి నాకు ఎంతగానో నచ్చింది: సోనమ్ కపూర్
ఆ బహుమతి తనకు ఎంతగానో నచ్చిందని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అంటోంది. ఇంతకీ ఏమిటా బహుమతి? ఎవరు పంపించారనేగా మీ అనుమానం?.. ‘పెప్పీ’ సంస్థ ఉత్పత్తి చేసే స్నాక్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో సోనమ్ చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ‘పెప్పీ’ ఎండీ వైశాలీ నాలుగు పెట్టెల ‘పెప్పీ’ స్నాక్స్ ని ఆమెకు బహుమతిగా పంపించారు. ఈ బహుమతి తనకెంతో నచ్చిందని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిందంటూ సోనమ్ తన ట్విట్టర్ లో పేర్కొంది. దీంతో పాటు ‘పెప్పీ’ ఎండీ రాసిన లేఖను, నాలుగు బాక్సుల ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా సోనమ్ బయటపెట్టింది. ‘పెప్పీ’ ఉత్పత్తి చేసే ‘సింబా’ కూడా తనకు ఇష్టమని పేర్కొంది. అంటే, 'అవి కూడా కాస్త పంపిద్దురూ' అన్నది దానర్థమని మనం అర్థం చేసుకోవాలేమో కదూ?