: విరుచుకుపడ్డ ఓపెనర్లు...రోహిత్ హాఫ్ సెంచరీ
టీమిండియా ఓపెనర్లు ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. యార్కర్, బౌన్సర్, గుడ్ లెంగ్త్, షార్ట్ పిచ్, గుగ్లీ ఇలా ఏ బంతిని సంధించినా టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ (42), రోహిత్ శర్మ (51) బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో టీట్వంటీని గెలిచి సీరిస్ ను రసకందాయంలో పెడదామని భావించిన ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి, టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో బరిలో దిగిన ధావన్, రోహిత్ లు ఆది నుంచి ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఓవర్ కి తొమ్మిది పరుగుల చొప్పున జత చేస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ఈ క్రమంలో పదకొండో ఓవర్ లో మ్యాక్స్ వెల్ వేసిన బంతిని భారీ షాట్ గా మలిచేందుకు యత్నంచిన ధావన్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో తొలి వికెట్ నష్టానికి భారత జట్టు 101 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ కు జతగా కోహ్లీ ఉన్నాడు.