: మంత్రి కేటీఆర్ ను కలిసిన సినీనటుడు రాజేంద్రప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఈ రోజు హైదరాబాదులో కలిశారు. చిత్రపరిశ్రమలోని సమస్యలపై వారు చర్చించినట్లు సమాచారం. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘మా’ సమస్యలపై మాట్లాడేందుకే కేటీఆర్ ని కలిశానని, రాజకీయాల జోలికి పోవడం లేదని అన్నారు.