: ఏపీ నూతన సీఎస్ గా ఎస్ పీ టక్కర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సత్య ప్రకాష్ టక్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఆగస్టు నెలాఖరు వరకు ఆయన సీఎస్ గా కొనసాగుతారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన టక్కర్ నిన్నటి వరకు ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత సీఎస్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచీ ఐవైఆర్ నవ్యాంధ్ర సీఎస్ గా చేస్తున్నారు.