: ఏఐసీసీ అధికార ప్రతినిధిగా మనీశ్ తివారి నియామకం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆయన నియామకానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అంగీకారం తెలిపారని ఏఐసీసీ సమాచార విభాగ సెక్రటరీ ఎస్.వి.రమణ చెప్పారు. మనీశ్ నియామకంతో ఏఐసీసీ అధికార ప్రతినిధుల సంఖ్య 28కి చేరింది. వారిలో 9 మంది సినియర్ నేతలు ఉన్నారు. యూపీఏ2 ప్రభుత్వంలో మనీశ్ సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.