: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ సానియా జోడీదే


అంతర్జాతీయ మహిళల టెన్నిస్ లో సానియామీర్జా- మార్టినా హింగిస్ జోడీ దూసుకెళుతోంది. మెల్ బోర్న్ పార్క్ లో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ లో మహిళల డబుల్స్ టైటిల్ ను సానియా జోడీ సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఏడవ సీడెడ్ క్రీడాకారిణులు ఆండ్రియా హ్లవకోవా- లూసీ హ్రడెకా జోడీని 7-6, 6-3తో ఓడించింది. దాంతో వరుసగా మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్ ను సాన్ టీనా (సానియా, మార్టినాలను కలిపి అలా అంటారు) జోడీ గెలుచుకుంది. ఈ విజయంతో సానియా, మార్టినాలు క్యాలెండర్ గ్రాండ్ శ్లామ్ కు చేరువలో ఉన్నారు.

  • Loading...

More Telugu News