: స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయాలు లేవు!: వెంకయ్యనాయుడు


తొలి దశలో విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. వాటి ఎంపికను తాము చేయలేదని, ప్రపంచ బ్యాంకు, జర్మనీ బ్యాంకు, ఐఐయూఏ ఎంపిక చేశాయని వెల్లడించారు. ఈ మేరకు మొత్తం మూడు ప్యానెళ్లు స్మార్ట్ సిటీల ఎంపికను చేపట్టాయని ఢిల్లీలో వివరించారు. ఇందులో రాజకీయ పార్టీల జోక్యం కాని, రాజకీయాలు కాని ఏ మాత్రం లేవన్నారు. స్మార్ట్ సిటీల కోసం నాడు కేంద్ర ప్రభుత్వం కేవలం మార్గదర్శకాలు మాత్రమే జారీ చేసిందని, ఆ సమయంలో స్మార్ట్ సిటీల ఎంపికకోసం పాటించాల్సిన ప్రమాణాలు కూడా చెప్పామని తెలిపారు. ఈ క్రమంలో మెరిట్ ప్రాతిపదికన నగరాల ఎంపిక జరిగిందని వెంకయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News