: టీ20 వరల్డ్ కప్ లో భారతే ఫేవరెట్... కెప్టెన్ ధోనీ ఆ జట్టు బలం: కుమార సంగక్కర వ్యాఖ్య


‘పొట్టి’ క్రికెట్ పండుగకు సమయం దగ్గరపడుతోంది. దాదాపు నెల రోజులకు పైగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ సిరీస్ వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ తొలి టైటిల్ చేజిక్కించుకున్న ధోనీ సేన ఆ తర్వాత ఈ ఫార్మాట్ లో అంతగా రాణించలేదు. తాజాగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ సిరీస్ లో టీమిండియానే ఫేవరెట్ గా క్రికెట్ దిగ్గజాలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు దేశాల క్రికెటర్ల నుంచి ఈ తరహా కామెంట్లు వినిపించగా, తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ఈ జాబితాలో చేరిపోయాడు. టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచే సత్తా భారత్ కు ఉందని సంగక్కర చెప్పాడు. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే అధిగమించగలిగిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశమని అతడు పేర్కొన్నాడు. ఇప్పటికే ఫామ్ లేమితో సతమతమవుతున్న ధోనీకి సంగక్కర కామెంట్లు కాస్తంత ఊరట కలిగించేవే. ధోనీ సామర్థ్యాన్ని అంచనా వేయడం ఏ ఒక్కరి సాధ్యం కాదని కూడా సంగక్కర తేల్చేశాడు.

  • Loading...

More Telugu News