: మేడారం భక్తులకు హెలికాప్టర్ సౌకర్యం.. త్వరలో హెలిప్యాడ్ నిర్మాణం


వరంగల్ జిల్లా మేడారం జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఢిల్లీకి చెందిన స్కై చుపీస్ లాగిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ డ్ వెల్ అనే ప్రైవేట్ సంస్థలు ఈ సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు చంద్రశేఖర్, వాసుసింగం మేడారానికి వచ్చి రెవెన్యూ ఇన్ స్పెక్టర్ చందా నరేశ్, వీఆర్ వో నర్సింహస్వామితో కలసి జాతర జరిగే పరిసరాల్లో హెలిప్యాడ్ నిర్మించేందుకు స్థల పరిశీలన చేశారు. అమ్మవార్ల గద్దెల వెనకాల గత పాత హెలిప్యాడ్, పడిగాపురం సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్, వరంగల్, ములుగు నుంచి ఒక్కో హెలికాప్టర్ సర్వీసు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News