: ఒక్క విద్యార్థి కూడా లేని హాస్టల్ ఖర్చు నెలకు రూ.4 లక్షలు!... ఏసీబీ దాడుల్లో తేలిన పచ్చి నిజం
పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఏర్పాటైన సర్కారీ హాస్టళ్లలో అవినీతి ఏ మేరకు జరుగుతోందనే అంశాన్ని నేటి ఉదయం కృష్ణా జిల్లాలో జరుగుతున్న ఏసీబీ దాడులు కళ్లకు కడుతున్నాయి. నేటి ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హాస్టళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా నందిగామ పరిధిలోని ఓ హాస్టల్ లో ఒక్క విద్యార్థి కూడా ఏసీబీ అధికారులకు కనిపించలేదు. దీంతో ఆశ్చర్యానికి గురైన అధికారులు హాస్టల్ లోని రికార్డులు చూసి షాక్ కు గురయ్యారు. ఎందుకంటే, సింగిల్ విద్యార్థి కూడా లేని సదరు హాస్టల్ కు ప్రభుత్వం నెలకు రూ.4 లక్షలను విడుదల చేస్తోందట. ప్రస్తుతం ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.