: ఆర్మీలోనూ అక్రమార్కులు... ఇద్దరు మేజర్ జనరళ్లపై సీబీఐ దర్యాప్తునకు పారికర్ ఆదేశం


దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడే సైన్యంపై జనానికి ఎనలేని అభిమానం. గౌరవం కూడా. ఆర్మీ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకునే వారు ఎందరో. అలాంటి సైన్యంలోనూ అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. జనాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. నిన్నటిదాకా ఇలాంటి వ్యవహారాలపై కోర్టు మార్షల్స్ తో సరిపెట్టిన ప్రభుత్వం, మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో ముందడుగేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు అవినీతి సైనికాధికారులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిన్న పారికరే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమోషన్ల కోసం ఇద్దరు సైనికాధికారులు లంచాలిచ్చినట్లు వచ్చిన వార్తలపై సైన్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్మీ సర్వీస్ కోర్ లో మేజర్ జనరల్ గా పనిచేస్తున్న అశోక్ కుమార్, ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ లో పనిచేస్తున్న మేజర్ జనరల్ ఎస్ఎస్ లాంబాలు పదోన్నతి కోసం తమ పై అధికారులకు లంచాలు ఎరవేశారట. ఈ విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పారికర్.. సదరు అధికారుల మొత్తం ఆస్తులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. ఇలా సైనికాధికారులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ కావడం ఇదే తొలి సారి.

  • Loading...

More Telugu News