: ‘రోహిత్’ ఘటనపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు... 3 నెలల్లో కేంద్రానికి నివేదిక
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను సమగ్రంగా వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య జ్యూడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అలహాబాదు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు నిన్న నరేంద్ర మోదీ సర్కారు ఓ కీలక ప్రకటన చేసింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా ఆ ప్రకటనలో కేంద్రం జ్యూడిషియల్ కమిషన్ కు సూచించింది.