: బుమ్రాను ఐపీఎల్ లో చూసినప్పుడే అనుకున్నాను!: షేన్ వాట్సన్


టీట్వంటీల్లో రాణించడం ఆస్ట్రేలియా జట్టుకు కష్టంగా మారిందని ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారని చెప్పాడు. అయితే ప్రత్యర్థి జట్టును బట్టి జట్టు కూర్పు క్లిష్టంగా మారిందని అన్నాడు. రెండో టీట్వంటీలో విజయం సాధించేందుకు నూటికి నూరు శాతం కష్టపడుతున్నామని వాట్సన్ తెలిపాడు. టీమిండియా బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా అరంగేట్రంలోనే ఆకట్టుకుంటున్నాడని వాట్సన్ ప్రశంసించాడు. యార్కర్లు, గుడ్ లెంగ్త్ బంతులను సంధించే బుమ్రా పరుగులను అడ్డుకుంటూ, వికెట్లు తీస్తున్నాడని అభినందించాడు. సరైన ప్రదేశాల్లో బంతులు విసురుతూ, విభిన్నమైన యాక్షన్ తో బుమ్రా ఆకట్టుకుంటున్నాడని వాట్సన్ తెలిపాడు. ఐపీఎల్ లో బుమ్రాను చూసినప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి త్వరగా వస్తాడని ఊహించానని, ఊహించినట్టే వచ్చాడని వాట్సన్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News