: తీవ్రవాది బిడ్డకు పాలిచ్చి మరోపాపం చేయను...దేశభక్తితో అమ్మదనాన్ని త్యాగం చేసిన మహిళ
దేశభక్తితో ఓ తల్లి అమ్మదనాన్ని త్యాగం చేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ఆస్మా అనే మహిళకు మూడేళ్ల క్రితం ఇజాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. గత ఏడాది కాలంగా అతని ప్రవర్తనలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయని, అతనికి ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్రవాదితో కాపురం చేసి తప్పుచేశానని పేర్కొన్న ఆమె, అతని బిడ్డకు పాలిచ్చి పెంచి పెద్దచేసి మరో తప్పు చేయలేనని, బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. దీంతో బిడ్డను శిశుసంరక్షణ కేంద్రానికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.