: అన్నా కేటీఆర్...హైదరాబాదును అభివృద్ధి చేసింది నీ తాతా? తండ్రా?: లోకేశ్ నిలదీత


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ చేసిన విమర్శలకు టీడీపీ నేత నారా లోకేశ్ సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సూచించారు. హైదరాబాదును ఈ స్థాయికి తీసుకొచ్చింది కేటీఆర్ తాతా? తండ్రా? అని ప్రశ్నించారు. హైదరాబాదు పరిపాలనలో కేటీఆర్ ఎప్పుడు భాగస్వామిగా మారారో మర్చిపోయినట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం వెలగబెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాదుకు ఏం చేసిందో చెప్పుకోవాలని ఆయన సూచించారు. తన తాత నందమూరి తారకరామారావు హైదరాబాదును ఉన్నతంగా తీర్చిదిద్దితే, తన తండ్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా మలిచారని లోకేశ్ తెలిపారు. టీఆర్ఎస్ నేతలకు వాస్తవాలు కనబడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాదులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసిందో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర పార్టీలు ఏం చేయలేదో చెప్పడం గొప్పకాదని సూచించిన లోకేశ్, టీఆర్ఎస్ హైదరాబాదుకు ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారం పేరుతో ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News