: కార్ల అమ్మకాల్లో తొలిస్థానంలో టయోటా
జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టొయోటా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కార్ల అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2015లో కోటికిపైగా వాహనాలను విక్రయించి తొలిస్థానాన్ని దక్కించుకుంది. దాంతో కార్ల అమ్మకాల్లో ఫోక్స్ వేగన్, జనరల్ మోటార్స్ ను వెనక్కి నెట్టిమరీ టయోటా వరుసగా నాలుగోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. తమ అనుబంధ సంస్థలైన దైహత్సు, హినోమోటార్స్ లిమిటెడ్ తో కలిసి గతేడాది 1,01,51,000 కార్లను టయోటా అమ్మింది. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, 0.8 శాతం అమ్మకాలు తగ్గాయని తెలిపింది.