: శ్రద్ధా కపూర్ చేతికి గాయం... అభిమానుల పరామర్శలు
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ చేతికి గాయమైంది. 'బాఘీ' షూటింగ్ లో పాల్గొంటున్న శ్రద్ధా కపూర్ తన చేతికి బ్యాండేజ్ ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసింది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఏమైందంటూ ఆరాలు తీశారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అభిమానుల పరామర్శలతో ఆమె ట్విట్టర్ అకౌంట్ నిండిపోయింది. కాగా, 'ఆషికీ2', 'ఏబీసీడీ', 'హైదర్' సినిమాలతో శ్రద్ధా కపూర్ విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అభిమానుల పరామర్శలకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఆమె తాజాగా టైగర్ ష్రాఫ్ సరసన 'బాఘీ' సినిమాలో నటిస్తోంది.