: తెలంగాణకు, తెలుగుదేశానికి అవినాభావ సంబంధం ఉంది: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ పెట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు పక్కా ఇళ్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం, మరిన్ని పథకాలు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న నేతలంతా ఎక్కడి నుంచి వచ్చారని ఆయన ప్రశ్నించారు. వీరా నన్ను విమర్శించేది? అని ఆయన ఆవేశంగా అడిగారు. తెలుగు దేశం పార్టీకి, తెలంగాణ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని ఎవరూ వేరు చేయలేరని ఆయన స్పష్టం చేశారు.