: ఎంఐఎం పార్టీ మాకు మిత్రపక్షమే: సీఎ కేసీఆర్


ఎంఐఎం పార్టీతో తమకున్న సంబంధాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ పార్టీ తప్పకుండా టీఆర్ఎస్ కు మిత్రపక్షమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని ప్రకటించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు మాట్లాడారు. ఈ సందర్భంగా మజ్లిస్ మతతత్వ పార్టీ అని మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత అంటున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన సీఎం... అలా ఎవరూ అనలేదని, తాము టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటామని శాసనసభ సాక్షిగా ఆ పార్టీ (ఎంఐఎం) ఫ్లోర్ లీడర్ ప్రకటించారు కదా? అని పేర్కొన్నారు. అంతేగాక తాము అధికారంలోకి రాగానే ఎంఐఎం సమావేశమై టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటామని నిర్ణయం కూడా తీసుకుందని కేసీఆర్ వివరించారు. అంతకుమించి వాళ్లు మతతత్వమా? లేదా ఇంకేదైనానా? వాళ్ల బ్లడ్ గ్రూప్ ఏంటి? ఇలాంటి విషయాలు తమకు అవసరం లేదన్నారు.

  • Loading...

More Telugu News